: టీఆర్ఎస్, జేఏసీ నేతలు సోనియాకు ఎందుకు కృతజ్ఞతలు చెప్పలేదు?: జగ్గారెడ్డి
టీఆర్ఎస్ నేతలు, జేఏసీ నాయకులు రాష్ట్రాన్ని ప్రకటించిన సోనియా గాంధీకి ఎందుకు కృతజ్ఞతలు చెప్పలేదని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ప్రశ్నిచారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ఆంధ్రులందర్నీ తిట్టడం వెనుక కేసీఆర్ అంతర్యం ఏమిటని అడిగారు. సరిగా మాట్లాడడం నేర్చుకోవాలని ఆయన కేసీఆర్ కు హితవు పలికారు.