: ప్రయోగాత్మకంగా శ్రీవారి స్వర్ణరథం ఊరేగింపు
తిరుమల శ్రీవారికి కొత్తగా తయారు చేయించిన స్వర్ణరథాన్ని టీటీడీ ఈరోజు ప్రయోగాత్మకంగా ఊరేగించింది. తిరుమాడ వీధుల్లో దాదాపు గంటసేపు ఊరేగింపు కార్యక్రమం జరిగింది. అనంతరం, స్వర్ణరథాన్ని ఆలయం ఎదుట నూతనంగా నిర్మించిన మండపంలో భద్రపరిచారు. సుమారు రూ.25 కోట్ల వ్యయంతో రథాన్ని టీటీడీ అత్యంత కళాత్మకంగా తయారు చేయించింది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా వచ్చేనెల 10న ఈ రథంపై తిరుమలేశుడు ఊరేగనున్నాడు.