: రాష్ట్ర విభజనపై సీడబ్ల్యుసీ వెనక్కి తగ్గదు: జేడీ శీలం
రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోదని కేంద్ర మంత్రి జేడీ శీలం స్పష్టం చేశారు. ముందుకెళ్ళే క్రమంలో ఉత్పన్నమయ్యే సమస్యలను పరిష్కరించాలన్నారు. సమైక్యాంధ్ర కోసం సీమాంధ్ర ఉద్యోగులు చేస్తున్న సమ్మెను విరమించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ సమస్యను పరిష్కరిస్తే ఉద్యమ తీవ్రత తగ్గుతుందని ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.