: బంగాళాఖాతంలో అల్పపీడనం

పశ్చిమ బెంగాల్, ఒడిశా తీరాలను ఆనుకుని వాయువ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. దీనికి తోడు ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి స్థిరంగా కొనసాగుతోందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. వీటి ప్రభావంతో రానున్న 24 గంటల్లో ఉత్తర కోస్తాలో పలుచోట్ల... తెలంగాణ, రాయలసీమ, దక్షిణ కోస్తాలో కొన్ని చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు ప్రకటించింది.

More Telugu News