: ఢిల్లీలో మోడీ భారీ ర్యాలీ నేడే

దేశంలో అన్ని ప్రాంతాలనూ చుట్టేస్తున్న మోడీ... ఇప్పుడు ఢిల్లీ గడ్డపై తన వాణి వినిపించేందుకు సిద్ధమయ్యారు. ఈ రోజు హస్తినలో బీజేపీ 'వికాస్ ర్యాలీ'ని నిర్వహించనుంది. రోహిణి ప్రాంతంలోని జపనీస్ పార్కులో ఈ ర్యాలీని నిర్వహిస్తున్నారు. మోడీ ప్రసంగించనున్న ఈ సభకు 5 లక్షల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా, దాదాపు 25 వేల మంది ముస్లింలు కూడా ఈ సభకు వస్తారని పార్టీ అంచనా వేస్తోంది. వీరితో పాటు, 40 దేశాలకు చెందిన దౌత్యవేత్తలు, విశ్రాంత సైనికోద్యోగులు, క్రీడాకారులు హాజరవుతున్నారని సమాచారం. ఇప్పటికే సభకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని బీజేపీ శ్రేణులు తెలిపాయి. సభా ప్రాంగణంలో 100 అడుగుల నరేంద్ర మోడీ కటౌట్ ను ఏర్పాటు చేశారు. సభను ప్రత్యక్ష ప్రసారం చేయడానికి ఢిల్లీ నగరంలో పలు చోట్ల ఎల్ ఈడీ తెరలను ఏర్పాటు చేశారు.

More Telugu News