: బీసీసీఐ అధ్యక్షుడిగా శ్రీనివాసన్ ఏకగ్రీవం
కొన్నాళ్ళుగా బీసీసీఐ అధ్యక్ష బాధ్యతలకు దూరంగా ఉంటున్న ఎన్.శ్రీనివాసన్ బోర్డుపై తన పట్టును మరోసారి నిరూపించుకున్నారు. బోర్డు అధ్యక్ష పదవికి ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నామినేషన్లకు శనివారం తుదిగడువు కాగా, ఆయనొక్కరే నామినేషన్ దాఖలు చేశారు. అయితే, ఆయన అర్హతపై బీహార్ క్రికెట్ సంఘం సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో.. తీర్పు వచ్చే వరకు అధ్యక్ష బాధ్యతలకు దూరంగా ఉండకతప్పదు. అల్లుడు గురునాథ్ మెయ్యప్పన్ పై ఐపీఎల్-6 సీజన్ సందర్భంగా బెట్టింగ్ ఆరోపణలు రాగా, తదనంతర పరిణామాల నేపథ్యంలో శ్రీనివాసన్ పదవికి దూరమయ్యారు. ఆయన స్థానంలో జగ్మోహన్ దాల్మియా తాత్కాలిక అధ్యక్షుడిగా పీఠం ఎక్కిన సంగతి తెలిసిందే.