: ఆర్డినెన్స్ ఎందుకు తెచ్చారు?: కేంద్రానికి చంద్రబాబు సూటి ప్రశ్న
కాంగ్రెస్ పార్టీ తాజాగా తెచ్చిన ఆర్డినెన్స్ పై పార్లమెంటులో రెండు రోజులు చర్చ జరిగినప్పుడు అందరూ ముక్తకంఠంతో ఖండించారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గుర్తు చేశారు. హైదరాబాదులోని ఆయన నివాసం నుంచి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ నిందితులను రక్షించేందుకు ఎందుకు తాపత్రయపడుతోందని ప్రశ్నించారు. సోనియాకు, రాహుల్ కు తెలియకుండా యూపీఏ ప్రభుత్వం ఈ ఆర్డినెన్స్ తీసుకొచ్చిందా? అని సూటిగా అడిగారు. అన్నీ తెలిసిన రాహుల్ గాంధీ ఇప్పుడే కలుగులోంచి బయటికొచ్చిన ఎలుకలా ఎందుకు ఖండించాడని అన్నారు. ఆర్థిక సంస్కరణలు వచ్చాక నిందితులు పెరిగారని అన్నారు.
గతంలో చట్టసభల్లో 5 శాతం నేరగాళ్లు అదీ ఆరోపణలు ఉన్నవారే ఉండేవారని.. ఇప్పుడు 30 శాతం మంది నేరగాళ్లు రాజకీయాల్లో రాజ్యమేలుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థిక నేరస్తులను కట్టడి చేయకపోతే దేశ భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని అన్నారు. సుప్రీం కోర్టు సీబీఐని ప్రక్షాళన చేయాలంటోందని, దానికి కారణం కాంగ్రెస్ పార్టీ కాదా? అని ఆయన ప్రశ్నించారు. అవినీతి కేసులన్నీ సుప్రీంకోర్టు జోక్యంతోనే వెలుగులోకి వచ్చాయని ఆయన గుర్తు చేశారు.
దేశంలోని అన్ని సమస్యలకు సోనియా, మన్మోహన్ సింగ్ లే కారణమని విమర్శించారు. సోనియా చెబితే ఆర్డినెన్స్ తీసుకొచ్చారనీ, రాహుల్ చెబితే ఆలోచిస్తామంటున్నారనీ మండిపడ్డారు. 'ఇదీ కాంగ్రెస్ తీరు' అంటూ బాబు ఎద్దేవా చేశారు. ప్రధానిగా ఉండే అర్హత మన్మోహన్ సింగ్ కు లేదని ఆయన ధ్వజమెత్తారు.