: థర్డ్ అంపైర్ ఔటిచ్చాక బ్యాటింగ్ ఎలా చేస్తారు?: శ్రీధర్ బాబు

రాష్ట్ర విభజన అంశంపై రాష్ట్ర రాజకీయ నేతలు క్రికెట్ పరిభాషలో వ్యాఖ్యానించడం ఎక్కువైపోయింది. స్టార్ బ్యాట్స్ మన్, నైట్ వాచ్ మన్, మ్యాచ్ ఫిక్సింగ్.. అంటూ ఇప్పటికే పలు పద ప్రయోగాలు చేసిన రాష్ట్ర నేతలు మరోసారి క్రికెట్ లాంగ్వేజి ఉపయోగించారు. మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, థర్డ్ అంపైర్ ఔటిచ్చాక బ్యాటింగ్ ఎలా చేస్తారని ప్రశ్నించారు. సీడబ్ల్యూసీ నిర్ణయం శిలాశాసనమని తేల్చి చెప్పారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోగా తెలంగాణ బిల్లు ఉంటుందని చెప్పిన మంత్రి.. తెలంగాణను అడ్డుకునేందుకు టీడీపీ, బీజేపీ పొత్తు పెట్టుకుంటున్నాయని విమర్శించారు.

More Telugu News