: సీఎం తనదారి తాను చూసుకుంటే మేలు: షబ్బీర్ అలీ

మాజీ మంత్రి షబ్బీర్ అలీ నిన్న సీఎం కిరణ్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. సీఎం కిరణ్ సమైక్యాంధ్ర ఉద్యమంలో హీరో కావాలని కోరుకుంటున్నారని, అందుకే ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు చేస్తూ తెలుగు ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు. హైదరాబాదులో మీడియాతో మాట్లాడుతూ.. కిరణ్ అధిష్ఠానం నిర్ణయాన్ని పాటించాల్సిందేనని, లేకుంటే తనదారి తాను చూసుకుంటే మేలని హితవు పలికారు. పార్టీని ధిక్కరించినవారు ఇప్పుడు అడ్రస్ లేకుండా పోయారని అన్నారు.

More Telugu News