: ఊపందుకున్న ప్రత్యేక విదర్భ డిమాండ్

మహరాష్ట్రలోని విదర్భ ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా విభజించాలనే డిమాండ్ ఊపందుకుంది. ఇందులో భాగంగా ఈ రోజు ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుతూ పాదయాత్రను చేపట్టారు. ఐదు రోజుల పాటు సాగే ఈ పాదయాత్రలో వేలాది మంది యువకులు పాల్గొంటున్నారు. గాంధీ జయంతి రోజైన అక్టోబరు 2న ఈ పాదయాత్ర గాంధీ సేవాగ్రామ్ వద్ద జరిగే భారీ సభతో ముగుస్తుంది. ఈ పాదయాత్రకు కాంగ్రెస్ నేత రంజిత్ దేశ్ ముఖ్ కుమారుడు ఆశిష్ దేశ్ ముఖ్ నాయకత్వం వహిస్తున్నారు. పలువురు కాంగ్రెస్ నాయకులు, మాజీ ఉన్నతాధికారులు ఈ యాత్రకు తమ సంఘీభావం తెలిపారు. విదర్భను 1953లో మహారాష్ట్రలో విలీనం చేశారు.

More Telugu News