: విభజనకు వ్యతిరేకంగా కూలీగా మారిన భూమన

రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి వినూత్న నిరసన తెలియజేశారు. తిరుపతి రైల్వే స్టేషన్ లో కూలీగా లగేజీ మోసి వ్యతిరేకత తెలిపారు. రాష్ట్రం విడిపోతే సీమాంధ్ర యువత భవితవ్యం ఇలాగే ఉంటుందని సింబాలిక్ గా చెప్పారు. ఈ సందర్భంగా భూమన మాట్లాడుతూ.. బలవంతంగా విడిపోయాక తమ ప్రాంతంలో విద్యావంతులు ఉద్యోగ అవకాశాలు కోల్పోతారని చెప్పారు. కృష్ణా, గోదావరి జలాలకు అడ్డుకట్ట వేశాక తమ ప్రాంతం బీడు భూమిగా మారే అవకాశం ఉందని తెలిపారు. అరవై రోజుల సుదీర్ఘ ఉద్యమం తర్వాత మేల్కొన్న సీఎం, నిన్న సమైక్యాంధ్రకే మద్దతు అంటే నమ్మేవాళ్లెవరూ లేరన్నారు.

More Telugu News