: మా రాజీనామాలు ఆమోదించాలని కోరాం: సాయిప్రతాప్
శని,ఆదివారాల్లో సభ ఛాయలకు కూడా రాని స్పీకర్ ఈ రోజు కార్యాలయానికి వచ్చి తమ అభిప్రాయాలు తెలుసుకున్నారని ఎంపీ సాయిప్రతాప్ అన్నారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, తాము ప్రజలతో మమేకమవ్వాల్సిన అవసరం ఉందని, అందుకే రాజీనామాలు చేశామని తెలిపారు. తామంతా స్వచ్ఛందంగా, ప్రజల కోరిక మేరకు వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా రాజీనామాలు చేశామని అన్నారు. ఇక ఉద్యమం చేస్తున్న ప్రజల్లోకి వెళతామని సాయిప్రతాప్ తెలిపారు.