: కరీంనగర్ లో ఎలుగుబంటి హల్ చల్
నిన్న రాత్రి కరీంనగర్ పట్టణంలో ఎలుగుబంటి హల్ చల్ చేసింది. అడవిలో ఉండాల్సిన ఎలుగుబంటి పట్టణంలో కలియతిరుగుతుంటే... ప్రజలు హడలిపోయారు. నిన్న రాత్రి 10.30 గంటల ప్రాంతంలో పట్టణ శివార్లలోని కిసాన్ నగర్ ప్రాంతంలో ఎలుగుబంటి దర్శనమిచ్చింది. దాంతో కంగారుపడిన స్థానికులు, ఎట్టకేలకు దాన్ని కర్రలతో తరిమికొట్టారు. అక్కడి నుంచి పరారైన ఎలుగుబంటి కరీంనగర్ పట్టణంలోకి ప్రవేశించి రాత్రంతా హడావుడి చేసింది. జిల్లా ఎస్పీ కార్యాలయం, జూనియర్ కాలేజీ మీదుగా చివరకు అటవీశాఖ కార్యాలయం వద్దకు చేరుకుంది. దీంతో అప్రమత్తమైన అటవీ అధికారులు చాకచక్యంగా ఎలుగుబంటిని బంధించారు. దీంతో పట్టణవాసులు ఊపిరి పీల్చుకున్నారు.