: సీఎంకు డీకే అరుణ సూటి ప్రశ్న

సమైక్యాంధ్రపై స్పష్టమైన అభిప్రాయాన్ని తెలియజేసిన ముఖ్యమంత్రి కిరణ్ వ్యాఖ్యలపై మంత్రి డీకే అరుణ స్పందించారు. విభజనపై సీఎం చేసిన వ్యాఖ్యలు సమంజసంగా లేవన్నారు. కాలానుగుణంగా రాజ్యాంగాన్ని, చట్టాన్ని ఎలా మార్చుకుంటున్నామో.. తెలంగాణ కూడ అలాంటిదేనన్నారు. భవిష్యత్తులో రెండు ప్రాంతాల ప్రజలుకు ఇష్టంలేని రోజున విడిపోవచ్చని గతంలో జవహర్ లాల్ నెహ్రూ చెప్పిన మాటలను మర్చిపోయారా? అంటూ మంత్రి గుర్తు చేశారు. విభజనపై నెహ్రూ కుటుంబ సభ్యురాలైన సోనియా తీసుకున్న నిర్ణయాన్ని ఎలా ప్రశ్నిస్తారని సూటిగా నిలదీశారు.

More Telugu News