: హైదరాబాద్ పై ఏకపక్షనిర్ణయం సరికాదు: హర్షకుమార్
హైదరాబాద్ పై ఏకపక్ష నిర్ణయం సరికాదని ఎంపీ హర్షకుమార్ అన్నారు. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తున్న సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులకు ఆయన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా తమ ప్రాంత ఎంపీలంతా సమైక్యాంధ్ర కోసం చిత్తశుద్ధితో పని చేస్తున్నామని హర్షకుమార్ అన్నారు.