: సిటీ బస్సులో వస్తానంటున్న మొయిలీ!
పెట్రోలియం శాఖ మంత్రి వీరప్ప మొయిలీ ఇంధనాన్ని పొదుపు చేసేందుకు సరికొత్త చర్య చేపట్టారు. అక్టోబర్ 9నుంచి ప్రతి బుధవారం సిటీ బస్సులో కార్యాలయానికి రావాలని నిర్ణయం తీసుకున్నారు. ఈనెల మొదట్లో రెండు సార్లు పెట్రోల్, పెట్రో ఉత్పత్తుల ధరలు పెరిగిన నేపథ్యంలో ఇంధనం అదుపుచేయాలని ప్రధానికి ప్రతిపాదించారు. అందుకు ఆయన సుముఖత వ్యక్తం చేయలేదు.