: శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అదనపు బస్సులు
అక్టోబర్ 5 నుంచి జరుగనున్న తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు అదనపు బస్సులు నడపనున్నట్లు టీటీడీ ఈవో ఎంజీ గోపాల్ తెలిపారు. ఈ ఉత్సవాలకు దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు వస్తారని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు రోజుకు 550 బస్సులను నడపనున్నట్లు చెప్పారు. ఈ రోజు తిరుపతిలో ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్ లో ఈవో మాట్లాడుతూ పలు విషయాలు వెల్లడించారు. తిరుమలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకునేందుకు రైల్వే స్టేషన్, బస్ స్టేషన్లలో సమాచార కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు.