: సోనియా దర్శకత్వంలో వైఎస్సార్ సీపీ నాటకం: వర్ల రామయ్య
సోనియా దర్శకత్వంలో వైఎస్సార్ సీపీ నాటకాలాడుతోందని టీడీపీ నేత వర్ల రామయ్య ఆరోపించారు. ఎన్టీఆర్ ట్రస్టు భవన్ లో ఈ రోజు ఆయన మాట్లాడుతూ, వైఎస్సార్ సీపీ నాయకులు అసెంబ్లీలో అడుగు పెట్టబోమని రెండు నెలల క్రితమే చెప్పారని గుర్తు చేశారు. సోనియా స్క్రీన్ ప్లే లోనే జగన్ ఇడుపులపాయ, ఇతర ప్రాంతాలకు వెళ్లేలా ప్రణాళికలు వేసుకున్నారని అన్నారు. 'ఇటలీకి, ఇడుపులపాయకు పోటీ' అని జగన్ తల్లికానీ, చెల్లి కానీ మరోసారి చెప్పగలరా? అని ఆయన ప్రశ్నించారు. 'జగన్ విభజన వాది. పైకి సమైక్యవాదమంటూ నాటకమాడుతున్నార'ని వర్ల రామయ్య తెలిపారు. రాజీనామాల ఒత్తిడి కూడా ఆ నాటకంలో భాగమేనని అన్నారు. సీమాంధ్ర ప్రజలను ఇంకా ఎంతకాలం మోసం చేస్తారని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్, జగన్ ల ద్వారా లబ్ది పొందాలన్నదే సోనియా ఆలోచన అని రామయ్య ఆరోపించారు.