: 'చలో ఢిల్లీ'కి సీమాంధ్ర విద్యార్ధి జేఏసీ పిలుపు

ఈ నెల 30న చలో ఢిల్లీకి సీమాంధ్ర విద్యార్ధి జేఏసీ పిలుపునిచ్చింది. జంతర్ మంతర్ వద్ద 72 గంటలపాటు దీక్షలు చేయనున్నట్లు తెలిపారు. విశాఖలో విద్యార్ధులపై పెట్టిన అక్రమ కేసులపై సీఎం దృష్టి సారించాలన్నారు. విభజన ఆగేంతవరకు అడుగడుగునా ప్రజాప్రతినిధులను అడ్డుకుంటామని హెచ్చరించారు. సమైక్య ఉద్యమంపై మొయిలీ, దిగ్విజయ్ చేసిన వ్యాఖ్యలను వ్యతిరేకిస్తున్నామన్న విద్యార్ధులు, తెలంగాణ నోట్ ఆపాలని డిమాండ్ చేశారు.

More Telugu News