: ప్రధానికి అమెరికా కోర్టు సమన్లు

ప్రధాని మన్మోహన్ సింగ్ కు అమెరికా కోర్టు సమన్లు జారీ చేసింది. 1990లో పంజాబ్ రాష్ట్రంలో ఉగ్రవాద నిరోధ ఆపరేషన్ల సందర్భంగా మానవహక్కుల ఉల్లంఘన జరిగిందంటూ కోర్టు ఆయనకు సమన్లు ఇచ్చింది. నాలుగు రోజుల పర్యటన కోసం ప్రధాని నిన్ననే అమెరికా వెళ్లారు. ఈ క్రమంలో అక్కడే ప్రధానికి కోర్టు సమన్లు ఇవ్వాలని న్యూయార్క్ లోని మానవహక్కుల సంస్థ 'సిఖ్ ఫర్ జస్టిస్' (ఎస్ఎఫ్ జె) ప్రయత్నిస్తోంది. కొన్నిరోజుల కిందట కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి కూడా ఇదే సంస్థ కోర్టు ద్వారా సమన్లు పంపింది. అయితే, వాటిని అందుకోకముందే ఆమె భారత్ కు వచ్చేశారు. కాగా, కేవలం ప్రచారం కోసమే ఎస్ఎఫ్ జె ఇలా ప్రముఖులకు సమన్లు ఇస్తోందంటూ న్యూయార్క్ లో కాంగ్రెస్ తరపు న్యాయవాది రవిబాత్రి ఓ కేసు దాఖలు చేశారు.

More Telugu News