: అక్టోబర్ మొదటివారంలో చంద్రబాబు మలి విడత 'ఆత్మ గౌరవ యాత్ర'

అక్టోబర్ నాలుగు లేదా ఐదో తేదీ నుంచి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మలి విడత 'ఆత్మ గౌరవ యాత్ర' కు సిద్ధమవుతున్నారు. రెండు జిల్లాలు ఒక యూనిట్ గా తీసుకుని బస్సు యాత్ర చేపట్టాలని నిర్ణయించటంతో ఆయన ఈసారి ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పర్యటించనున్నారు. ప్రకాశం జిల్లా పర్చూరు నుంచి మొదలై నెల్లూరు జిల్లా వరకూ ఈ యాత్ర జరగనున్నట్టు సమాచారం. సుమారు పది రోజులపాటు ఈ యాత్ర ఉంటుందని భావిస్తున్నారు.

More Telugu News