: రేపు దిలీప్ కుమార్ డిశ్చార్జ్
ప్రముఖ బాలీవుడ్ నటుడు దిలీప్ కుమార్ ముంబైలోని లీలావతి ఆసుపత్రి నుంచి రేపు డిశ్చార్జ్ అవుతున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. సెప్టెంబర్ 15న దిలీప్ కుమార్ కు గుండెపోటు రావడంతో చికిత్స నిమిత్తం లీలావతి ఆసుపత్రిలో చేర్చారు. పది రోజుల చికిత్స అనంతరం దిలీప్ కుమార్ ఆరోగ్యంగా ఉన్నారని, గురువారం మధ్యాహ్నం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారని కుటుంబ సభ్యులు వెల్లడించారు.