: చితకబాదిన పెరీరా
చాంపియన్స్ లీగ్ టి20 టోర్నీలో సన్ రైజర్స్ హైదరాబాద్ శుభారంభం చేసింది. గతరాత్రి ట్రినిడాడ్ అండ్ టొబాగో జట్టుతో మొహాలీ వేదికగా జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించారు. ఈ గ్రూప్-బి పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన ట్రినిడాడ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 160 పరుగులు చేసింది. ఆ జట్టులో డారెన్ బ్రావో (44 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సులతో 66) ఫిఫ్టీతో రాణించాడు. సన్ రైజర్స్ బౌలర్లలో తిస్సర పెరీరా, ఇషాంత్ శర్మ, సామి తలో రెండు వికెట్లు తీశారు. ఇక లక్ష్యఛేదనలో తిస్సర పెరీరా విరుచుకుపడ్డాడు. దీంతో, హైదరాబాద్ 19.3 ఓవర్లలో 6 వికెట్లకు 164 పరుగులు చేసి విజయభేరి మోగించింది.
మిడిలార్డర్ లో వచ్చిన పెరీరా ట్రినిడాడ్ బౌలింగ్ ను తుత్తునియలు చేస్తూ కేవలం 32 బంతుల్లోనే 57 పరుగులు చేసి జట్టును గెలుపుతీరాలకు చేర్చాడు. నాటౌట్ గా నిలిచిన పెరీరా 4 ఫోర్లు, 4 సిక్సులు బాదాడు. చివరి ఓవర్లో 7 పరుగులు అవసరం కాగా సన్ రైజర్స్ ఆటగాడు కరణ్ శర్మ.. స్టూవర్ట్ విసిరిన ఆ ఓవర్లో రెండో బంతిని ఫోర్, మూడో బంతిని సిక్స్ గా మలిచి జట్టు విజయాన్ని ఖరారు చేశాడు. అంతకుముందు జరిగిన మరో మ్యాచ్ లో టైటాన్స్ 4 పరుగుల తేడాతో బ్రిస్బేన్ హీట్స్ పై నెగ్గింది.