: దీంతో ఇక హాయిగా నిద్రపోవచ్చు

కొందరికి నిద్రలో శ్వాస సమస్య 'ఎప్నియా' ఉంటుంది. దీని కారణంగా వారికి నిద్రపోయే సమయంలో శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉంటుంది. ఇలాంటి వారికి పేస్‌మేకర్‌ లాంటి ఒక సరికొత్త పరికరంతో ఉపశమనాన్ని కలిగించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎప్నియా సమస్య ఉన్నవారికి నిద్రించే సమయంలో శ్వాసమార్గంలో అడ్డంకులు ఏర్పడి, మెదడుకు సంకేతాలు ఇచ్చే వ్యవస్థ దెబ్బతింటుంది.

ఎప్నియా సమస్యతో బాధపడేవారికి పేస్‌మేకర్‌ లాంటి ఈ సరికొత్త పరికరాన్ని అమర్చినప్పుడు వారికి ఉపశమనం కలుగుతున్నట్టు ఓహియో విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ సమస్యను నిర్ధారించడం కష్టమని ఈ పరిశోధనల్లో పాల్గొన్న డా. రమి ఖయత్‌ తెలిపారు. ఈ సమస్యనుండి ఉపశమనం కోసం అమెరికాకు చెందిన కంపెనీ ఒకటి ట్రాన్స్‌వీనస్‌ ఫ్రీనిక్‌ నర్వ్‌ స్టిములేటర్‌ అనే పరికరాన్ని తయారుచేసింది. దీన్ని 47 మంది రోగులకు వారి మెడవద్ద ఎముకకు అమర్చి, వారిని ఆరునెలలపాటు పరిశీలించారు. ఇది నిద్రలో శ్వాస సమస్య ఏర్పడినప్పుడు డయాఫ్రంకు సంకేతాలను ఇచ్చి, శ్వాసలో ఏర్పడిన అడ్డంకులను తొలగిస్తుందని తమ పరిశోధనలో తేలిందని శాస్త్రవేత్తలు తెలిపారు.

More Telugu News