: ఎన్నికల ముందు తేలాల్సినవి చాలా ఉన్నాయి: చాకో

ఎవరైనా జైల్లో ఉండాల్సి రావడాన్ని కాంగ్రెస్ పార్టీ హర్షించదని ఏఐసీసీ అధికార ప్రతినిధి పీసీ చాకో తెలిపారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, జైలు నుంచి విడుదలైన జగన్ ను సంతోషంగా ఉండనివ్వండని అన్నారు. ఎన్నికలకు చాలా సమయం ఉందని, అంతకు ముందు తేలాల్సినవి చాలా ఉన్నాయని వైఎస్సార్సీపీతో పొత్తు వార్తలపై స్పందిస్తూ వ్యాఖ్యానించారు. రాజ్ నాథ్ సింగ్, ప్రకాశ్ కారత్ లతో భేటీ అంతర్యమేమిటో చంద్రబాబు చెప్పాలని చాకో డిమాండ్ చేశారు.

More Telugu News