: దేవుడు కరుణించాడు.. జగన్ రాకతో బాధ పోయింది: బ్రదర్ అనిల్
దేవుడు కరుణించాడని, జగన్ విడుదల కావడంతో ఇన్నాళ్లూ పడిన బాధ తొలగిపోయిందని జగన్ బావ బ్రదర్ అనిల్ ఆనందం వ్యక్తం చేశారు. జగన్ విడుదలైన సందర్భంగా హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో ఆయన మాట్లాడుతూ.. కుట్రలు, కుతంత్రాలు తమకు తెలియవని, ప్రజలకు మంచి చేయడమే తమకు తెలుసని అన్నారు. ఆరోపణలు చేసేవాళ్లు చేస్తూనే ఉంటారని, అయితే అంతిమంగా సత్యానిదే విజయమని ఆయన అన్నారు. తనకు రాజకీయాలు తెలియవంటూనే.. చంద్రబాబు నాయుడు మామ ఎన్టీఆర్ పై విమర్శలు చేశారని గుర్తు చేశారు.