: సుప్రీం ఉత్తర్వులకు వ్యతిరేకంగా నేతల రక్షణ కోసం ఆర్డినెన్స్
న్యాయస్థానాలపైనా, ప్రజాస్వామ్య వ్యవస్థపైనా అపారమైన గౌరవాన్ని బహిరంగంగా ప్రకటించే రాజకీయ నాయకులు తమ అసలు రూపాన్ని బయటపెట్టుకున్నారు! దోషులైన ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎన్నికల్లో పోటీచేసేందుకు అర్హులు కారన్న సుప్రీం కోర్టు ఉత్తర్వులకు వ్యతిరేకంగా.. ప్రజాప్రతినిధులు దోషులైనా సరే పార్లమెంటుకు హాజరయ్యేలా, ఎన్నికల్లో పోటీ చేసేలా కేంద్రం ఆర్డినెన్స్ ను తీసుకొచ్చింది. దీంతో ఎంపీలు, ఎమ్మెల్యేలు దోషులైనా పార్లమెంటుకు హాజరుకావొచ్చు అని కేంద్రం పేర్కొంది. అయితే జీతభత్యాలు తీసుకోరాదని స్పష్టం చేసింది. ఈ ఆర్డినెన్స్ ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు అని, ఇక చట్టసభలన్నీ దోషులతో నిండిపోయే ప్రమాదముందని మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.