: సీఎం రాజీనామా చేయవద్దన్నారు: మాగుంట
సీమాంధ్ర ప్రజలకు అన్యాయం జరగని విధంగా ఎంపీల నిర్ణయం ఉండాలని సీఎం కిరణ్ సూచించారని ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి అన్నారు. రాజీనామాలు చేయడం వల్ల ఉపయోగం ఉండదని, ఎంపీలుగా ఉంటూనే సమైక్యాంధ్ర కోసం పోరాడాలని ముఖ్యమంత్రి చెప్పారని తెలిపారు. సీమాంధ్ర ఎంపీలు ఈ రోజు ఢిల్లీలో సీఎం కిరణ్, పీసీసీ అధినేత బొత్సతో సమావేశమయ్యారు.