: యంత్రంపై మనకు ప్రేమ ఎక్కువేనట
రోబో సినిమాలో తాను తయారుచేసిన రోబోను... చివరికి నాశనం చేసేటప్పుడు ఆ శాస్త్రవేత్త కంట తడిపెడతాడు... గుర్తుందా... అలాగే రోబోలను ఉపయోగించేవారు అవి పాడైపోయినప్పుడు ఎక్కువ బాధపడుతున్నారట. అంటే ప్రాణంలేని యంత్రాలపై మానవులు మమకారాన్ని పెంచుకుంటున్నారట. ఈ విషయం తాజా అధ్యయనంలో వెల్లడైంది. మనిషి సహజంగా తన చుట్టుపక్కల ఉన్నవాటిని ప్రేమిస్తుంటాడు. అయితే ప్రాణం లేని ఒక యంత్రాన్ని ప్రేమించడం కూడా మనిషికే సాధ్యం. అందుకే అది యంత్రమే అయినా అది పాడైపోయినప్పుడు తీవ్ర బాధకు గురవుతున్నట్టు ఈ అధ్యయనంలో తేలింది.
రోబోలపై మానువులు మమకారాన్ని పెంచుకుంటారా.... అనే విషయంలో వాషింగ్టన్ విశ్వవిద్యాలయానికి చెందిన జూలి కార్పెంటర్ ఒక అధ్యయనాన్ని నిర్వహించింది. బాంబులను నిర్వీర్యం చేసే రోబోలను వినియోగిస్తున్న కొందరు సైనికులపై ఆమె అధ్యయనం చేసింది. ఈ అధ్యయనంలో రోబోలను ఉపయోగించేవారు వాటిని తమ పెంపుడు జంతువులుగాను, మిత్రులుగాను భావిస్తూ వాటిపై మమకారాన్ని పెంచుకుంటున్నట్టు జూలి గుర్తించింది. ఈ అధ్యయనంలో రోబోలతో పనిచేయించడం, అవి నాశనమైనప్పుడు వారి పనితీరుపై ఎలాంటి ప్రభావం ఉంటుందనే విషయం గురించి ఆమె వారిని ప్రశ్నించింది. రోబోలను వాడడం వల్ల తమ పనితీరు, సామర్ధ్యంపై ఎలాంటి ప్రభావం ఉండడం లేదని ఈ అధ్యయనంలో పాల్గొన్నవారు చెప్పారు. అయితే ఎప్పుడైనా రోబోలు ప్రమాదానికి గురైనప్పుడు లేదా అవి నిర్వీర్యం అయినప్పుడు బాధపడుతున్నట్టు ఆమె పరిశీలించారు. అంతేకాకుండా అవి మరమ్మత్తులకు గురైనప్పుడు వారు తీవ్ర నిరాశకు, ఒత్తిడికి గురవుతున్నట్టు జూలి తన అధ్యయనంలో గుర్తించారు. రోబోలు జీవంలేని యంత్రాలే... అయినా వాటికి తమకు నచ్చిన పేర్లను పెట్టిమరీ పిలుచుకుంటున్నట్టు, వాటిపై ఎక్కువ మమకారాన్ని పెంచుకుంటున్నట్టు జూలి ఈ అధ్యయనంలో గుర్తించింది. అలాగే ఏదైనా పనిలో పాల్గొన్నప్పుడు అవి ధ్వంసమైనప్పుడు కొందరు ఖరీదైన వస్తువును కోల్పోయామని భావిస్తే, మరికొందరు తీవ్ర నిరాశకు, ఒత్తిడికి గురవుతున్నారని జూలి నిర్వహించిన అధ్యయనంలో తేలింది.