: లక్ష్మీనారాయణ బదిలీ తర్వాత కుమ్మక్కయ్యారు: సోమిరెడ్డి
సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ బదిలీ అయిన తర్వాతే జగన్ కు బెయిల్ విషయంలో కుమ్మక్కు రాజకీయం ఊపందుకుందని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. మీడియాతో మాట్లాడుతూ, జగన్ కు బెయిల్ వచ్చినా ఆయన ప్రజల్లో ముద్దాయేనని స్పష్టం చేశారు. నలుగురు మంత్రులు, 10 మంది ఐఏఎస్ అధికారులు, 36 మంది పారిశ్రామికవేత్తలను 420లుగా మలిచిన ఘనత జగన్ దేనన్నారు. ప్రజాధనాన్ని కొల్లగొట్టిన జగన్ పై ఈడీ ఎందుకు విచారణ జరపడంలేదని ప్రశ్నించారు. సత్యం కుంభకోణం విషయంలో సత్యం సంస్థను స్వాధీనం చేసుకున్నఈడీ, జగన్ ఆస్తులను ఎందుకు స్వాధీనం చేసుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.