: 28 న హైదరాబాద్ లో సీమాంధ్ర న్యాయవాదుల సదస్సు

హైదరాబాదులోని ఏపీఎన్జీవో హోంలో సీమాంధ్ర న్యాయవాదుల జేఏసీ సమావేశం జరిగింది. సమైక్యాంధ్రప్రదేశ్ న్యాయవాదుల సదస్సు గోడపత్రికను ఈ నెల 28న హైదరాబాదులో ఆవిష్కరించనున్నట్టు న్యాయవాదులు తెలిపారు. గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో జరుగనున్న సదస్సుకు హైదరాబాద్ తో పాటు, సీమాంధ్ర జిల్లాల నుంచి కూడా న్యాయవాదులు హాజరు కానున్నారు.

More Telugu News