: కొత్త రాజధాని నిర్మాణానికి ఎంత ఖర్చవుతుందో చెప్పలేం: ఛత్తీస్ గఢ్ మాజీ సీఎస్
కొత్త రాజధాని నిర్మాణానికి ఎంత ఖర్చవుతుందో అంచనా వేయడం సాధ్యం కాదని ఛత్తీస్ గఢ్ ప్రభుత్వ మాజీ చీఫ్ సెక్రటరీ తెలిపారు. హైదరబాద్ లో ఓ సదస్సులో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ పద్దతి ప్రకారం పని చేసుకుంటూ వెళితే తమ సచివాలయంలో కార్యాకలాపాలు ప్రారంభించేందుకు 12 ఏళ్లు పట్టిందని అన్నారు. రాజధాని నిర్మాణానికి ఇంత సమయం అని కానీ, ఇంత ఖర్చు అని కానీ అంచనా వేయలేమని ఆయన అన్నారు. అదీ కాక రాజధాని నిర్మాణం అంటే ఆషామాషీ వ్యవహారం కాదని, ఇందులో రాజకీయ పార్టీల చిత్తశుద్ధితో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాత్ర కూడా కీలకమని, వాటిలో ఏ ఒక్కటి లేకపోయినా అన్ని మౌలిక వసతులతో రాజధాని నిర్మాణం అసాధ్యమని ఆయన తేల్చి తెలిపారు.