: విభజన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి: బాలమోహన్ దాస్
విభజన నిర్ణయాన్ని కేంద్రం తక్షణం వెనక్కి తీసుకోవాలని సమైక్యాధ్ర రాజకీయేతర జేఏసీ అధ్యక్షుడు ఆచార్య బాలమోహన్ దాస్ డిమాండ్ చేశారు. విశాఖ ఆర్కేబీచ్ లో రాజకీయేతర జేఏసీ ఆధ్వర్యంలో సమైక్యగర్జన సభలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రాల విభజన విషయంలో రెండో ఎస్సార్సీ వేయాలని డిమాండ్ చేశారు. విభజనపై 23 జిల్లాల్లో రెఫరెండం నిర్వహించి నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు. సీమాంధ్ర పార్టీలన్నీ సమైక్యాంధ్ర కోసం రాజకీయ జేఏసీ ఏర్పాటు చేయాలని ఆయన కోరారు.