: రాజ్ నాథ్ ముజఫర్ నగర్ పర్యటన రద్దు
మత ఘర్షణలతో అట్టుడికిన ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ జిల్లాలో జీజేపీ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ పర్యటనకు బ్రేక్ పడింది. జిల్లా మేజిస్ట్రేట్ సూచన మేరకు ఆయన తన పర్యటనను రద్దు చేసుకున్నారు. ముజఫర్ నగర్ జిల్లాలో జరిగిన అల్లర్లలో 48 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. ప్రాణాలను అరచేతిలో పెట్టుకున్న 41 వేల మంది నిరాశ్రయులు... పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు.