: పోలీసుల అదుపులో వందమంది అనుమానితులు
బంగ్లాదేశ్ నుంచి హైదరాబాదుకు అక్రమంగా చొరబడే వారి సంఖ్య పెరుగుతోంది. భారీ సంఖ్యలో చొరబాటుదారులు నగరానికి చేరుకుంటున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో కాపు కాశారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో తనిఖీలు చేపట్టారు. ఈ నేపథ్యంలో తెల్లవారుజామున నగరానికి చేరుకున్న గౌతమి ఎక్స్ ప్రెస్ లో వచ్చిన ప్రయాణికులను పోలీసులు ప్రశ్నించారు. వీరిలో బంగ్లాదేశ్ వాసులుగా భావిస్తున్న దాదాపు 100 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వీరిని మూడు వాహనాల్లో పోలీస్ స్టేషన్ కు తరలించారు. వీరిని పూర్తిగా విచారించి సమగ్ర వివరాలు తెలుసుకుంటామని నార్త్ జోన్ డీసీపీ తెలిపారు. తమ అదుపులో ఉన్నవారికి ఉగ్రవాద సంస్థలతో ఏమైనా సంబంధాలు ఉన్నాయా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్టు ఆయన తెలిపారు.