: సహ కమిషనర్ల నియామకంపై కోర్టులో పిటిషన్
సమాచార హక్కు చట్టం కమిషనర్ల నియామకంపై మరోసారి రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ప్రభాకర్ రెడ్డి, రతన్, మధుకర్ రాజు, విజయబాబులను గతంలో ప్రభుత్వం కమిషనర్లుగా నియమించింది. అయితే, వీరి నియామకం చట్ట విరుద్ధమంటూ కరీజ అనే వ్యక్తి నేడు కోర్టును ఆశ్రయించారు. పిటిషన్ ను విచారణకు స్వీకరించిన కోర్టు, కమిషనర్లతో పాటు ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది. ఇదిలా ఉంచితే, ఇటీవల మరో నలుగురు కమీషనర్ల నియామకం చెల్లదంటూ హైకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి మనకు విదితమే!