: పశ్చిమ బెంగాల్లో మరో అరాచకం.. వీసీ, ప్రో వీసీ, రిజిస్ట్రార్ నిర్బంధం

పశ్చిమ బెంగాల్లో అరాచకాలకు అంతు లేకుండా పోతోంది. తాజాగా విద్యార్థులను సస్పెండ్ చేశారన్న నెపంతో జాధవ్ పూర్ యూనివర్సిటీ వీసీ, ప్రో వీసీ, రిజిస్ట్రార్ లను 22 గంటలపాటు విద్యార్థులు నిర్బంధించారు. ఇంతకీ వారేమన్న గొప్ప రికార్డున్న విద్యార్థులా అంటే అదీ కాదు. ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్న ఇద్దరు విద్యార్థులు రెండవ ఏడాది చదువుతున్న విద్యార్థిని ర్యాగింగ్ చేశారు. ఈ మేరకు బాధితుడు ఆగస్టు 25 న ఫిర్యాదు చేశాడు. ఆరాతీసిన యాజమాన్యం అందుకు కారకులైన విద్యార్థులిద్దరినీ మొదటి సెమిస్టర్, రెండవ సెమిస్టర్ కు హాజరు కాకూడదంటూ సస్పెన్షన్ విధించింది. దీంతో విద్యార్థులు వీసీ, ప్రో వీసీ, రిజిస్ట్రార్ లను నిన్న మధ్యాహ్నం నుంచి నిర్బంధించారు.

More Telugu News