: టోనీబ్లెయిర్ కుమార్తెకు తుపాకీ బెదిరింపు

బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ కుమార్తెకు దొంగలు షాకిచ్చారు. బ్లెయిర్ కుమార్తె కేథరీన్ ఇటీవల తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి కుక్కను వెంటేసుకుని లండన్ లోని మెరిల్ బోన్ ప్రధాన వీధిలో వాకింగ్ కు వెళ్లారు. ఇంతలో ముసుగులు ధరించిన ఇద్దరు దుండగులు డబ్బు, బంగారు నగలు ఇవ్వాల్సిందిగా తుపాకీతో బెదిరించారు. అయితే ఆ సమయంలో వారి వద్ద నగదు, ఖరీదైన వస్తువులు లేవు. దీంతో దొంగలు వారిని వదిలేసి పారిపోయారు. తమకు ప్రమాదం వాటిల్లనప్పటికీ దిగ్భ్రాంతికి గురయ్యామని కేథరీన్ తెలిపారు.

More Telugu News