: జగన్ రిమాండు పొడిగింపు
అక్రమాస్తుల కేసులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి రిమాండును హైదరాబాదులోని నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టు ఆగస్టు 12వ తేదీ వరకు పొడిగించింది. మాజీమంత్రి మోపిదేవి వెంకటరమణ, ఆడిటర్ విజయసాయి రెడ్డి, కేవీ బ్రహ్మానందరెడ్డి, నిమ్మగడ్డ ప్రసాద్ ల రిమాండును అదే తేదీకి పొడిగించింది. అటు, ఓంఎంసీ కేసులో కోర్టు ఎదుట హాజరైన గాలి జనార్ధన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డిల రిమాండు కూడా ఆగస్టు 12 వరకు పొడిగిస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది.