: రాయపాటి నివాసం ముట్టడి
గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు నివాసాన్ని ఏపీఎన్జీవో, విద్యార్ధి, రాజకీయ, సమైక్యాంధ్ర పరిరక్షణ జేఏసీలు సమష్టిగా ముట్టడించాయి. ఈ సందర్భంగా, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు సీమాంధ్ర ఎంపీలు వెంటనే రాజీనామా చేసి అధిష్ఠానంపై ఒత్తిడి పెంచాలని వారు డిమాండ్ చేశారు. నిజమైన సమైక్యవాదుల్లా ఉద్యమంలోకి రావాలంటూ రాయపాటిని సమైక్యాంధ్ర ఉద్యమకారులు కోరారు.