: విశాఖలో సమైక్యవాదుల అరెస్ట్

సమైక్యాంధ్రకు మద్దతుగా రాజీనామా చేయాలంటూ విశాఖలో కేంద్రమంత్రి పురందేశ్వరి ఇంటిని ముట్టడించిన విద్యార్థి, ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఉదయం నుంచి పురేందేశ్వరి నివాసం ఎదుటే బైఠాయించి ఆందోళన చేపట్టిన సమైక్యవాదులను తొలుత పోలీసులు హెచ్చరించారు. అయినా వారు అక్కడినుంచి వెళ్ళకపోవడంతో వారిని అదుపులోకి తీసుకుని త్రీటౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ప్రస్తుతం మంత్రి నివాసం వద్ద బందోబస్తు పెంచారు.

More Telugu News