: యూపీని విడగొట్టిన తర్వాతే ఆంధ్రప్రదేశ్ ను విభజించాలి: సోమిరెడ్డి
ఉత్తరప్రదేశ్ ని విడగొట్టిన తరువాతె ఆంధ్రప్రదేశ్ ను విభజించాలని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. నెల్లూరులో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని విడగొట్టాలని చూస్తే సహించేది లేదని ఆ పార్టీని హెచ్చరించారు. ఓట్లు, సీట్లతో రాహుల్ ను ప్రధానిని చేయాలని కాంగ్రెస్ చూస్తోందని, రాజధాని, నదీ జలాలు, రెవెన్యూ విషయాలు చర్చించకుండా ఎలా విడగొడతామని ప్రకటన చేస్తారని ఆయన మండిపడ్డారు. తెలంగాణ విషయంలో సోనియాగాంధీ ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు.