: ఒకే ఇంట్లో 250 ఓట్లు.. పార్టీల పాట్లు!

ఇంతకంటే విచిత్రం ఉంటుందా? ఎంత ఉమ్మడి కుటుంబమైనా 250 మంది ఒకే ఇంట్లో నివసించడం, వారందరకీ ఓటు హక్కు ఉండడం అసాధ్యమే. కానీ, కృష్ణా జిల్లా మూలపాడులో ఓ నివాసంలో ఏకంగా 250 ఓట్లు ఉన్నాయన్న విషయం విస్తుగొలుపుతోంది. తప్పుడు చిరునామాతో ఈ ఓట్లను స్థానికేతరులు వేస్తున్నారంటూ స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే, ఓటరు జాబితాలో పేరు ఉంది కాబట్టే తాము వారిని ఓటింగ్ కు అనుమతించామని పోలింగ్ అధికారులు చెప్పారు. సదరు ఓటర్లను టీడీపీ ఏజెంటు అడ్డుకున్నాడు. వారు ఓటర్ ఐడీతో పాటు నివాస ధ్రువీకరణ పత్రం తీసుకువస్తేనే ఓటేసేందుకు క్లియరెన్స్ ఇస్తానని స్పష్టం చేశాడు.

More Telugu News