: చంద్రబాబే కాదు.. చందమామ కూడా నిద్రపోనివ్వడు

‘నేను నిద్రపోను, మిమ్మల్ని నిద్రపోనివ్వను’ అనే మాట వింటేనే రాష్ట్రంలో ఎవ్వరికైనా సరే నారా చంద్రబాబునాయుడు గుర్తుకొస్తారు. తను సీఎంగా ఉన్న రోజుల్లో ఆ నినాదం ద్వారా.. ఆయన అధికారులను ఎంతగా పరుగులెత్తించి పనిచేయించేవారో అందరికీ తెలిసిన సంగతే. అయితే ప్రస్తుతం చందమామకూడా నిద్రపోనివ్వనంటున్నాడు. ఎలాగంటే..

ఆకాశంలో చందమామ గమనం సాగే తీరుతెన్నులను బట్టి మనుషుల నిద్రాసమయాలు డిసైడ్‌ అయ్యే అవకాశం ఉన్నదంటూ శాస్త్రవేత్తలు తమ తాజా అధ్యయనంలో తేల్చారు. పౌర్ణమి రోజుకు ముందు,వెనుక సాధారణంగా చాలామందిలో నిద్రలేమి అనే సమస్య కనిపిస్తూ ఉంటుంది. వీరిలో నిద్ర లేకపోవడానికి డైరక్టుగా చందమామ గారి విశ్వరూపం కనిపించే పౌర్ణమికి లింకు ఉంటుందిట. పౌర్ణమి రోజుల్లో మనుషులు సాధారణంగా 20 నిమిషాలు తక్కువ నిద్రపోతారట. దీనిపై అనేకానేక పరిశోధనలు చేసిన తర్వాత.. శాస్త్రీయ పరమైన రుజువులు లభించినట్లు.. శాస్త్రవేత్తలు అంటున్నారు. చంద్రుడి గమనాన్ని బట్టి.. మానవశరీరం స్పందిస్తుంది అనేది ఇప్పుడు శాస్త్రీయంగా రుజువైందన్నమాట. మన కథలు, కవిత్వాల్లో మనసును ప్రభావితం చేసేవాడిగా ముద్రపడ్డ చందమామ.. ఇప్పుడు సైంటిఫిక్‌గా నిద్రను ప్రభావితం చేసేవాడిగా నిగ్గుతేలాడు.

More Telugu News