: అమెరికా క్రికెట్ జట్టు కెప్టెన్ గా గుజరాత్ యువకుడు

అమెరికా అవడానికి అగ్రరాజ్యమే అయినా క్రికెట్ వంటి క్రీడల విషయానికొస్తే ఇంకా పసికూనే. అందుకే, తమ జట్టును బలోపేతం చేసుకునేందుకు అమెరికా క్రికెట్ సంఘం భారత ఉపఖండం ఆటగాళ్ళకు గాలం వేస్తుంటుంది. ఈ క్రమంలో కెప్టెన్ గా ఓ భారత జాతీయుడిని నియమించింది. తిమిల్ పటేల్ అనే 29 ఏళ్ళ గుజరాతీ యువకుడు ఇప్పడు అమెరికా జాతీయ జట్టు పగ్గాలు చేపట్టాడు. తిమిల్ భారత దేశవాళీ క్రికెట్లో ప్రధాన టోర్నీ అయిన రంజీ ట్రోఫీలో 38 మ్యాచ్ లాడాడు. 2002లో గుజరాత్ తరుపున తొలి రంజీ ఆడిన తిమిల్, 2009లో చివరిసారిగా హిమాచల్ ప్రదేశ్ తో రంజీ మ్యాచ్ లో పాల్దొన్నాడు. అనంతరం అమెరికా వలస వెళ్ళాడు.

గత ఏడాదే అమెరికా తరుపున అంతర్జాతీయ కెరీర్ ఆరంభించిన ఈ గుజరాత్ క్రికెటర్, తాజాగా కెనడా పర్యటనకు సారథిగా ఎంపికయ్యాడు. కాగా, పేరుకే అమెరికా, కెనడా జట్లు అయినా, వాటిలో అత్యధికులు భారత్, పాకిస్తాన్, శ్రీలంకకు చెందిన క్రికెటర్లే ఉండడం విశేషం.

More Telugu News