: మరో యూఎస్ యూనివర్సిటీ మూత.. ఎక్కువమంది తెలుగు విద్యార్థులే

అమెరికాలో మరో బోగస్ యూనివర్సిటీ మూతపడింది. కార్యకలాపాలు నిలిపివేయాల్సిందిగా నార్తర్న్ వర్జీనియా యూనివర్సిటీని అక్కడి అధికారులు ఆదేశించారు. 500 మంది వరకు భారతీయ విద్యార్థులు ఇందులో విద్యనభ్యసిస్తున్నారు. ఎక్కువ మంది తెలుగువారేనని సమాచారం. వీరిలో కొంతమంది మరో బోగస్ యూనివర్సీటీ అయిన ట్రైవ్యాలీ యూనివర్సిటీ నుంచి నార్తర్న్ వర్జీనియాకు వచ్చినట్లు సమాచారం. వీసాల మోసాలకు పాల్పడినందుకు ట్రైవ్యాలీ యూనివర్సిటీని 2011లో మూసేశారు. చట్టాలను ఉల్లంఘించి మరీ భారతీయ విద్యార్థులను ఈ యూనివర్సిటీలు ఆకర్షించాయని దర్యాప్తులో వెల్లడైంది. సరైన గుర్తింపు, ఫ్యాకల్టీ, పాఠ్యప్రణాళిక ఏవీ లేకుండా ట్రైవ్యాలీ వలే నార్తర్న్ వర్జీనియా యూనివర్సిటీ నడుస్తోందని తేలింది. అది కూడా ఒక ఆఫీసు భవనం కింద, కేవలం నాలుగు తరగతి గదులతో ఏకంగా యూనివర్సిటీనే నడుపుతున్నట్లు గుర్తించడంతో అధికారులు చర్య తీసుకున్నారు.

More Telugu News