: దిగ్విజయ్ సింగ్ ను కలిసిన కేవీపీ
రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు ఢిల్లీలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ తో భేటీ అయ్యారు. రాష్ట్ర విభజన అంశంపై హస్తినలో రాజకీయాలు వేడెక్కిన సమయంలో వీరిద్దరి భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. దాదాపు అరగంట పాటు సమావేశమైన వీరు ఏ అంశాలపై చర్చించుకున్నారనేది తెలియరాలేదు. అయితే, విభజన విషయంపై ఇంతవరకు ఎక్కడా, ఎప్పుడూ నోరువిప్పని కేవీపీ దిగ్విజయ్ తో ఏం మాట్లాడి ఉంటారు? తాను సమైక్యాంధ్ర వాదిననే చెప్పారా? అని పలు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.