: ముగిసిన రెండో విడత పంచాయతీ ప్రచారం

రెండో విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం నేటితో ముగిసింది. హైదరాబాదులో ఎన్నికల సంఘం రాష్ట్ర కార్యదర్శి నవీన్ మిట్టల్ మాట్లాడుతూ, ఎల్లుండి రెండో విడత పంచాయతీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ప్రచార గడువు ఈ సాయంత్రంతో ముగిసిందని ప్రకటించారు. 27 వ తేదీన ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకూ పోలింగ్ జరుగుతుందని తెలిపారు. అనంతరం ఓట్ల లెక్కింపు ఉంటుందని, లెక్కింపు ముగిశాక పోలింగ్ ఆఫీసర్ ఫలితాలను ప్రకటిస్తారని ఆయన అన్నారు.

More Telugu News