: టీచర్ల తీరుతో.. బీహార్ బాలల పస్తులు

బీహార్లో ఉపాధ్యాయులు మధ్యాహ్న భోజన పథకాన్ని బహిష్కరించారు. దీంతో, ఈ రోజు మధ్యాహ్న భోజనం లభించక బాలలు పస్తులుండాల్సి వచ్చింది. పది రోజుల క్రిందట చాప్రాలో 23 మంది బాలలు మధ్యాహ్న భోజనం కలుషితమై మరణించడంతో, బియ్యం పప్పులు మాత్రమే అందించే ప్రభుత్వం వాటిని నిల్వ చేసేందుకు అవసరమైన సామగ్రిని తమనే సమకూర్చుకోమంటోంది. తాము స్థానికంగా దొరికే వస్తువులను నిల్వకు వాడుతున్నామని ఉపాధ్యాయులు చెబుతున్నారు. దీంతో, ఆహారం కలుషితమై బాలలపై ప్రభావం చూపుతుండడంతో టీచర్లను బాధ్యులుగా చేస్తోంది ప్రభుత్వం.

ఈ నేపథ్యంలో మధ్యాహ్న భోజనపథకాన్ని నిలిపివేయాలంటూ ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు ఆ పథకాన్ని బహిష్కరించారు. ఇంత భారీ పథకాన్ని ఇప్పటికిప్పుడు ఏజెన్సీలకు అప్పగించడం సాధ్యంకాదన్నది బీహార్ ప్రభుత్వం వాదన. అయితే ఎవరి నెత్తిన వేస్తారంటూ ప్రశ్నిస్తున్న ఉపాధ్యాయులు ఏకంగా పథకాన్నే ఆపేయమంటున్నారు.

More Telugu News