: 'మధ్యాహ్న భోజనం'తో మాకు సంబంధం లేదు: బీహార్ టీచర్లు
బీహార్ టీచర్లు ప్రభుత్వ 'మధ్యాహ్న భోజన' పథకాన్ని బహిష్కరించాలని నిర్ణయించారు. బోధనేతర పనుల బాధ నుంచి తప్పించుకునేందుకు ఉపాధ్యాయులు ప్రణాళికలు రచిస్తున్నారు. బీహార్లో ఈమధ్యే మధ్యాహ్న భోజన పథకంతో 23 మంది బాలలు మృతి చెదిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలొ ఉపాధ్యాయ సంఘాలన్నీ ఏకతాటిపై నిలిచాయి. ఈ పథకంలో అవినీతి వల్ల తమకే చెడ్డపేరు వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. నామమాత్రపు నిధులతో నాణ్యతలేని భోజనం పెట్టాల్సి వస్తోందని, అదనంగా ఈ పనులు చేస్తున్నా, కష్టనష్టాలన్నింటికి టీచర్లనే బాధ్యులుగా చేయడం దారుణమని, అందుకే తామంతా ఈ పథకాన్ని బహిష్కరించాలని నిర్ణయించుకున్నామని తెలిపారు.
దీనిపై ఇప్పటికే చాలాసార్లు ప్రభుత్వానికి లిఖితపూర్వక నివేదనలు పంపామని, అయినా పట్టించుకోవడంలేదని వాపోతున్నారు. మధ్యాహ్న భోజన పథకాన్ని పర్యవేక్షించే బాధ్యతలు వేరే వారికి అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. టీచర్లు ఈ పథకాన్ని బహిష్కరించడం వల్ల 72 వేల పాఠశాలల్లో ఈ పథకం నిలిచిపోనుంది. ప్రభుత్వం తమపై బలవంతంగా రుద్దాలని ప్రయత్నిస్తే తాము ఆందోళనకు దిగుతామని బీహార్ టీచర్లు హెచ్చరిస్తున్నారు.